జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు వచ్చీ పోయే నాయకులు, కార్యకర్తలతో హడావుడిగా మారింది. బల్దియా ఎన్నికల బరిలో నిలిచేందుకు నాయకులు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడ్డారు.
నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడిన గాంధీభవన్ - గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం
చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా.... నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. మహిళలు సైతం పెద్దఎత్తున గాంధీ భవన్కు చేరుకుని దరఖాస్తులు చేసుకున్నారు.
నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడిన గాంధీభవన్
అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీల సమావేశాలతో పాటు నాయకుల రాకపోకలు, దరఖాస్తులు చేయడానికి వచ్చిన ఆశావహులు, తదితరులతో గాంధీభవన్ కిటకిటలాడింది. ప్రతి నాయకుడు 10 నుంచి 20 మంది కార్యకర్తలను వెంటపెట్టుకుని రావడం వల్ల ముందెన్నడూ లేనివిధంగా జనంతో రద్దీగా కనిపించింది.