శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల 88 వేల 687 దరఖాస్తులు అందాయి. అందులో నాలుగు లక్షలా 66 వేలకు పైగా.. ఆన్లైన్లో రాగా.. 21వేల పైచిలుకు దరఖాస్తులు ఆఫ్లైన్లో వచ్చాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం భారీగా దరఖాస్తులు - హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ నియోజకవర్గం
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్, నల్గొండ- వరంగల్ - ఖమ్మం నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది.
heavy flow of application for graduate mlc vote
నల్గొండ- వరంగల్ - ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం ఐదు లక్షల 17వేల 529 దరఖాస్తులు వచ్చాయి. అందులో నాలుగు లక్షల 13వేలకు పైగా ఆన్లైన్లో రాగా... లక్షకు పైగా ఆఫ్లైన్లో అందాయి. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సైతం అధికారులు ప్రారంభించారు.