- వికారాబాద్: ధరూర్ మం. దోర్నాల వద్ద వాగులో వ్యక్తి గల్లంతు
- వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన గోరయ్య అనే వ్యక్తి
Rain Effect: రాష్ట్రంలో అలుగులు దూకుతున్న చెరువులు.. దోర్నాల వద్ద వాగులో వ్యక్తి గల్లంతు - పొంగుతున్న వాగులు
heavy floods in telangana
10:44 September 05
వాగులో వ్యక్తి గల్లంతు...
09:29 September 05
కోయిల్‌సాగర్ గేట్లు ఎత్తివేత
- మహబూబ్‌నగర్: కోయిల్‌సాగర్ జలాశయం గేట్లు ఎత్తివేత
- కోయిల్‌సాగర్ 5 గేట్లు ఎత్తి 9 వేల క్యూసెక్కుల విడుదల
- కోయిల్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులు
09:21 September 05
రాత్రి 8:30 నుంచి ఇవాళ 8 వరకు నమోదైన వర్షాపాతం
09:12 September 05
రహదారిపై వరద ప్రవాహం
- విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
- అబ్దుల్లాపూర్‌మెట్ మం. ఇనాంగూడ వద్ద రహదారిపై వరద ప్రవాహం
- రంగారెడ్డి: ఇనాంగూడ వద్ద అలుగు పారుతున్న బాటచెరువు
- విజయవాడ-హైదరాబాద్ రహదారిపైకి బాటచెరువు అలుగు
- బాటచెరువు అలుగుతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
- ఇనాంగూడ వద్ద అలుగు నీటిలోనే వాహనాల రాకపోకలు
08:55 September 05
2 కి.మీ. మేర ట్రాక్ బండిపై గర్భిణి తరలింపు
- వికారాబాద్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
- తాండూరు మం. బెల్కటూర్ వద్ద ఉద్ధృతంగా వాగు ప్రవాహం
- బెల్కటూర్ వాగుకు వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు
- బెల్కటూర్‌కు చెందిన గర్భిణిని రైలు పట్టాలపై తరలింపు
- గర్భిణికి పురిటినొప్పులతో అంబులెన్స్‌కు ఫోన్ చేసిన గ్రామస్థులు
- బెల్కటూర్ వాగుకు వరద ఉద్ధృతితో అంబులెన్స్ రాలేని పరిస్థితి
- రైలు పట్టాలపై 2 కి.మీ. మేర ట్రాక్ బండిపై గర్భిణి తరలింపు
08:55 September 05
శ్రీరాంసాగర్ జలాశయానికి వరద
- శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 46,558 క్యూసెక్కుల ప్రవాహం
- 11గేట్ల ద్వారా 37,440 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
- విద్యుదుత్పత్తి ద్వారా 7500 క్యూసెక్కులు విడుదల
- శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు
- శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ 90 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు
08:55 September 05
అలుగు పారుతున్న చింతలచెరువు
- రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద నిండిన చింతలచెరువు
- నిన్న కురిసిన వర్షాలకు నిండిన అబ్దుల్లాపూర్‌మెట్ చింతలచెరువు
- అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద అలుగు పారుతున్న చింతలచెరువు
- హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై చింతలచెరువు అలుగు
- చింతలచెరువు అలుగుతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
08:54 September 05
దిగువ మానేరుకు భారీగా వరద
- కరీంనగర్: దిగువ మానేరు జలాశయానికి భారీగా వరద
- మధ్యమానేరు, మోయతుమ్మెద వాగు నుంచి వరద ప్రవాహం
- దిగువ మానేరు జలాశయానికి 78 వేల క్యూసెక్కుల ప్రవాహం
- దిగువ మానేరు 16 గేట్లు ఎత్తి 91 వేల క్యూసెక్కుల విడుదల
- దిగువ మానేరు జలాశయం గరిష్ఠ నీటినిల్వ 24 టీఎంసీలు
- దిగువ మానేరు జలాశయం ప్రస్తుత నీటినిల్వ 22 టీఎంసీలు
08:51 September 05
ఉద్ధృతంగా మోయతుమ్మెద వాగు..
- సిద్దిపేట: బస్వాపూర్ వద్ద ఉద్ధృతంగా మోయతుమ్మెద వాగు
- బస్వాపూర్ వద్ద వంతెనపై నుంచి మోయతుమ్మెద వాగు ప్రవాహం
- సిద్దిపేట- హనుమకొండ రోడ్డులోని వంతెనపై నుంచి వాగు ప్రవాహం
- సిద్దిపేట- హనుమకొండ రహదారిలో రాకపోకలు నిలిపివేత
Last Updated : Sep 5, 2021, 10:46 AM IST