తెలంగాణ

telangana

ETV Bharat / city

Hyderabad Rains 2021 : ముంచెత్తిన వాన.. ఇళ్లలోకి వరద.. జల దిగ్బంధంలో పలు కాలనీలు - Hyderabad rains 2021

హైదరాబాద్​లో మరోసారి వాన(Hyderabad Rains 2021) దంచికొట్టింది. ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన భారీ వానకు(Hyderabad Rains 2021) నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. పలు కాలనీల్లో ప్రజలు తమ ఇళ్లలోకి చేరిన వరదనీటిని ఎత్తిపోసే పనిలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా చేరిన వరదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad Rains 2021
Hyderabad Rains 2021

By

Published : Oct 9, 2021, 9:57 AM IST

ముంచెత్తిన వాన

భాగ్యనగరాన్ని మరోసారి వాన(Hyderabad Rains 2021) ముంచెత్తింది. మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి(Hyderabad Rains 2021) హైదరాబాద్‌ తడిసిముద్దైంది. రాత్రి ఏడున్నర గంటల నుంచి దాదాపుగా మూడుగంటల పాటు వాన దంచికొట్టింది. రాత్రి కురిసిన వాన(Hyderabad Rains 2021) వల్ల వచ్చిన వరదతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే టికెట్ బుక్​ చేసుకున్న ప్రయాణికులు ఈ వరదతో అవస్థలు పడుతున్నారు.

ఏకధాటిగా కురిసిన వర్షానికి(Hyderabad Rains 2021) నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి పరిధిలోని పలు కాలనీల్లో నీరు నిలిచింది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వీవీనగర్‌ వెళ్లే మార్గంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేక అవస్థలు పడుతున్నారు.

చాంద్రాయణగుట్ట పరిధిలో పలు బస్తీల్లో వరద నీరు(Hyderabad Rains 2021) ఇళ్లలోకి చేరింది. జంగమ్మెట్ డివిజన్‌ లక్ష్మీనగర్‌ను వరద ప్రవాహం ముంచెత్తింది. మూడడుగుల మేర నీరు నిలవడం వల్ల కార్లు నీట మునిగాయి. పలు చోట్ల బైక్​లు వరదలో కొట్టుకుపోయాయి. నగరంలో జిల్లెలగూడ బాలాజీ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. నడుములోతు నీటితో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పలు ఇళ్లలో వరద నీరు(Hyderabad Rains 2021) పోయి బురద పేరుకుంది. వరద ప్రవాహానికి ఇళ్లలోని వస్తువులు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. గత 15 ఏళ్లుగా వాన పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతోందని.. వాన(Hyderabad Rains 2021) వచ్చిపోయిన 10 రోజుల వరకు మళ్లీ మామూలు స్థితికి రాలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడు వాన కురిసినా.. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమవుతున్నాయి. చంపాపేటలోని రెడ్డికాలనీ జలదిగ్బంధం(Hyderabad Rains 2021)లో చిక్కుకుపోయింది. ఈ కాలనీలో డ్రైనేజీ పనులు నడుస్తుండటం వల్ల.. మురికి నీళ్లు ఇళ్లలోకి చేరాయి. రాత్రంతా ఇళ్లలోకి వస్తున్న నీటిని ఎత్తిపోస్తూ కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ఇళ్లలో నీరు(Hyderabad Rains 2021) నిలిచి ఉండటం వల్ల వాటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. వాన(Hyderabad Rains 2021) పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంపాపేట్, సరూర్​నగర్ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. సరూర్​నగర్ కోదండరాం నగర్​లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హయత్​నగర్, బంజారాకాలనీ, అంబేడ్కర్ కాలనీ, బాలాపూర్​ చౌరస్తాలోని లెనిన్​నగర్​లో ఇళ్లలోకి నీరు చేరింది. అబ్దుల్లాపూర్​మెట్​ మండలం గుంతపల్లి వద్ద మజీద్​పూర్​ మార్గంలో వాగులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details