తెలంగాణ

telangana

ETV Bharat / city

Ap rains 2021: వానలు ఆగినా.. తప్పని తిప్పలు!

AP floods 2021: వానలు ఆగినా చాలా చోట్ల వరుణుడు మిగిల్చిన కష్టాలు కొనసాగుతున్నాయి..! కొన్ని గ్రామాలు..ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికీ చాలాచోట్ల మునిగిన కాలనీలు, వీధులు దర్శనమిస్తున్నాయి.! చాలాచోట్ల జనం కట్టుబట్టలతో మిగిలిపోయారు..! చిత్తూరు జిల్లాలో రాయలచెరువు పరిధిలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కడప, నెల్లూరు జిల్లాల్లోని వరద బాధితులూ ఇంకా ముంపు నుంచి తేరుకోలేదు.

Ap rains 2021, andhra pradesh flood news
ఏపీలో తగ్గని వరదలు

By

Published : Nov 23, 2021, 11:53 AM IST

Andhra pradesh flood news: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో వర్షం ఆగి రెండు రోజులు గడిచినా చాలా గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. రహదారులు కోతకు గురై చాలాగ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జిల్లాలో సుమారు 30 వేలమందిపై వరద ప్రభావం చూపింది. రాయలచెరువుకు చిన్న గండి పడడంతో రామచంద్రాపురం, తిరుపతి గ్రామీణ మండలాల పరిధిలోని 16 గ్రామాల్లో14 వేల 960 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. వరద బాధితులు కట్టుబట్టలతో వచ్చినాపశువుల్ని వదిలేసి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలచెరువుకు గండి పడిన ప్రాంతాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించి తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండి పూడ్చేందుకు ఐఐటీ నిపుణుల సలహా తీసుకుంటున్నామని, వీలైనంత త్వరగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులో వరద(ministers review on Ap Floods) పీడిత ప్రాంతాలను ఆ రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ పరిశీలించారు. సహాయక చర్యలు సహా... విద్యుత్ సరఫరా పునరుద్ధణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దగ్గర ప్రవాహంతో నేలమట్టమైన శివాలయాన్నితెలుగు రాష్ట్రాల దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కమలానంద భారతి పరిశీలించారు.

కడప జిల్లాలో...

కడప జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న అద్దాలమర్రి బ్రిడ్జిని కాంగ్రెస్ నేతతులసిరెడ్డి సందర్శించారు. అతివృష్టికి.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోడై.. భారీ నష్టానికి కారణమైందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయలచెరువుకు స్వల్ప గండిపడి వరదనీరు లీకవుతోంది. ఈ ప్రాంతంలో కట్ట నుంచి మట్టి క్రమంగా జారిపోతోంది. భారీ వర్షాలకు తిరుపతి సమీపంలోని రాయలచెరువు నిండుకుండలా మారింది. సామర్థ్యం కంటే ఎక్కువ నీరు వస్తుండటంతో కట్ట తెగే ప్రమాదం(Rayalacheruvu update) ఉందని ఆయకట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాయలచెరువుకు 30 మీటర్ల వెడల్పుతో 2.5 కి.మీ కట్ట ఉంది. రాయలచెరువు నీటి సామర్థ్యం 0.5 టి.ఎం.సీలు కాగా..ప్రస్తుతం 0.9 టి.ఎం.సీల నీరు చేరడంతో ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. చెరువు కట్టకు చిన్న గండి పడడంతో చెరువులోంచి వరదనీరు లీకు అవుతోంది. అప్రమత్తమైన అధికారులు దక్షిణం వైపు ఉన్న కట్టను తొలగించి జేసీబీల సాయంతో నీటిని మళ్లించారు. స్థానికులు, ఎన్​డిఆర్​ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి పెద్ద సంఖ్యలో ఇసుక బస్తాలను సమకూర్చుకుని నీరు లీకవుతున్న ప్రాంతంలో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:Rayalacheruvu tirupati news: రాయలచెరువుకు మోగుతున్న ప్రమాదఘంటికలు..

ABOUT THE AUTHOR

...view details