శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. జూరాల ప్రాజెక్టు నుంచి 2 లక్షల పది వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి లక్షా 75 వేల 656 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుతం 832.30 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... 51.96 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2 వేల 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు - heavy_flood_water_to_srisailam_project
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 832.30 అడుగుల మేర నీరు ఉంది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు