తెలంగాణ

telangana

ETV Bharat / city

Huge Flood to Sreesailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 2 రోజుల్లో నిండే అవకాశం! - శ్రీశైలం జలాశయం

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.40 అడుగులకు నీరు చేరింది. మరో 55 టీఎంసీల నీరు వస్తే... శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది.

heavy-flood-flow-to-srisailam-reservoir
శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 2 రోజుల్లో నిండే అవకాశం!

By

Published : Jul 27, 2021, 11:50 AM IST

ఎగువ ప్రాంతాల నుంచి ఏపీలోని శ్రీశైలం జలాశయానికి 3,22,262 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.40 అడుగుల మేర నీరుంది. గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 160.91 టీఎంసీలుగా నమోదైంది. మరో 55 టీఎంసీల నీరు వస్తే... శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది.

ఈ సీజన్​లో వర్షాలు బాగా కురవడం వలన ప్రస్తుతం 3,22,262 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. ఒట్​ఫ్లో కింద తెలంగాణ పవర్ హౌస్, పోతిరెడ్డి పాడు అన్నీ కలిసి 38 వేల క్యూసెక్కుల వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇదే విధంగా రెండ్రోజులు నీళ్లు వచ్చినట్లయితే... శ్రీశైలం డ్యాం రెండు రోజుల్లో అంటే బుధవారం, గురువారం కల్లా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. తర్వాత గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్.. ఏపీ జెన్కో పవర్ హౌస్ కూడా పర్మిషన్ ఇస్తున్నారు. సో అది కూడా రన్ చేసినట్లయితే... బుధవారం కల్లా డ్యాం నిండే అవకాశం ఉంది. - వెంకట రమణయ్యశ్రీశైలం డ్యామ్ ఎస్.ఈ

వరద ప్రవాహం ఇదే తీరుగా కొనసాగితే.. బుధ, గురువారాల నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని ఆనకట్ట పర్యవేక్ష ఇంజినీర్ వెంకట రమణయ్య తెలిపారు. జలాశయం నిండగానే.. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్​కు నీటిని విడుదల చేయవచ్చన్నారు.

జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద

జూరాల జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 3.35 లక్షలు, ఔట్‌ఫ్లో 3,16,708 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 6.325 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చూడండి:TRAGEDY: విశాఖ జిల్లాలో విషాదం.. బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి..!

ABOUT THE AUTHOR

...view details