తెలంగాణ

telangana

ETV Bharat / city

వాగు ఒడ్డున భారీ మొసలి కళేబరం..! - తెలంగాణ వార్తలు

Crocodile in Vishaka : విశాఖ మన్యం బలపం పంచాయతీలోని చెరువూరు వాగులో భారీ మొసలి కళేబరం ప్రత్యక్షమైంది. అయితే..దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో వాగు సమీపంలోనే పూడ్చిపెట్టారు గిరిజనులు.

Crocodile in Vishaka , forest crocodile
వాగు ఒడ్డున.. భారీ మొసలి కళేబరం..!

By

Published : Feb 26, 2022, 5:26 PM IST

Crocodile in Vishaka : ఆంధ్రప్రదేశ్ విశాఖ మన్యంలో భారీ మొసలి కళేబరం కనిపించింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు వాగులో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఆ కళేబరాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారు. ఇది సుమారు 12 అడుగుల పొడవుతోపాటు భారీ దేహంతో ఉంది. ఆ కళేబరాన్ని చూసేందుకు స్థానిక గిరిజనులు ఎగబడ్డారు. అయితే.. కళేబరం నుంచి దుర్వాసన వస్తుండటంతో వారు.. దీన్ని సమీపంలోనే పూడ్చిపెట్టారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న చెరువూరు వాగుపై వంతెనలు లేకపోవడంతో వాగులు దాటుకుంటూ స్థానికులు గ్రామాలకు చేరుకుంటుంటారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వాగులో నీరు తాగేందుకు వెళ్లిన కొందరు గిరిజనులు.. ఈ ముసలిని గుర్తించారు. ఏమైందో తెలియదుగానీ.. వాగు ఒడ్డున అది చనిపోయి ఉంది.

పెద్దవాగు కావడంతో అప్పుడప్పుడు ఇందులో భారీ మొసళ్లుతోపాటు మొసళ్ల పిల్లలు కనిపిస్తున్నట్టు గిరిజనులు చెపుతున్నారు. మన్యంలో వాగుల్లో మొసళ్ల సంచారం ఉందని చెపుతున్నప్పటికీ.. ఇంత పెద్ద పరిమాణంలో మొసలి కనిపించడం తొలిసారి.

ఇదీ చదవండి:ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా..: రేవంత్

ABOUT THE AUTHOR

...view details