తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో భానుడి ప్రతాపం... గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి.

weather
weather

By

Published : Apr 19, 2022, 6:58 PM IST

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్​ జిల్లా లక్ష్మపూర్​లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​ నార్త్​, ఆదిలాబాద్​ భోరాజ్​లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్​పల్లి, ఆలిపూర్​, ఆదిలాబాద్​ జిల్లా చాపర్లలో ​ 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో ఉష్ణోగ్రత వివరాలు

ABOUT THE AUTHOR

...view details