తెలంగాణ

telangana

ETV Bharat / city

గుండెనొప్పితో ఆస్పత్రికి రోగి.. డాక్టర్లు లేక గంటపాటు విలవిల.. ఆ తర్వాత.. - Patient hospitalized with heart attack

గుండెనొప్పితో ఆస్పత్రికి రోగి
గుండెనొప్పితో ఆస్పత్రికి రోగి

By

Published : May 22, 2022, 2:09 PM IST

Updated : May 22, 2022, 3:30 PM IST

14:07 May 22

పరిగి ఆస్పత్రి వైద్యుల బాధ్యతారాహిత్యం.. బాధితుని పరిస్థితి దయనీయం..

వికారాబాద్ జిల్లాలోని పరిగి ప్రభుత్వ అసుపత్రిలో వైద్యుల బాధ్యతారాహిత్యం.. ఓ రోగి​ ప్రాణాల మీదికి తెచ్చింది. తీవ్రమైన గుండెనొప్పితో పరుగుపరుగున పరిగి ఆస్పత్రికి వచ్చిన బాధితున్ని.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 50 పడకల ఆసుపత్రిలో ఒక్కగానొక్క నర్సు తప్ప.. సిబ్బంది ఎవరూ కనిపించలేదు. వైద్యులెవరూ లేకపోవటంతో.. ఆసుపత్రి బెడ్‌పైనే బాధితుడు నొప్పితో గిలగిలా కొట్టుకున్నాడు.

కిష్టమ్మగుళ్ల తాండకు చెందిన సోమ్లా నాయక్​కు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రతరం కావటంతో తట్టుకోలేకపోయిన సోమ్లానాయక్​.. కుటుంబసభ్యుల సాయంతో పరిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. తీరా ఆస్పత్రికి వచ్చాక.. అక్కడ మందలించే సిబ్బందే లేదు. ఆస్పత్రి మొత్తానికి ఒక్క నర్సు ఉంది. కనీసం ప్రాథమికంగా చేసే వైద్యం కూడా అందకపోవటంతో.. బాధితుడు సుమారు గంటపాటు బెడ్​పైనే నొప్పితో విలవిలాడిపోయాడు. బాధితుని ఆవస్థ చూసి.. కాళ్లుచేతులు ఆడని నర్సు.. వైద్యులను సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ.. వైద్యుల ఫోన్లు స్విచ్ఛాఫ్​. గత్యంతరం లేక నర్సే.. బాధితుడికి ఈసీజీ తీసీ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులకు సూచించింది.

ఆలస్యమయ్యే కొద్ది బాధితుని పరిస్థితి విషమంగా మారుతుండటం చూసి ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. అంబులెన్స్​ మాట్లాడుకుని బాధితున్ని వికారాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అత్యవసరసేవల కింద వైద్యం అందించాల్సిన సందర్భంలో.. కనీసం బాధితునికి ప్రాథమికంగా అందించాల్సి వైద్యమైనా అందించేందుకు ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ లేకపోవటం.. వారి నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి అద్ధం పడుతోంది.

మరోవైపు.. గర్భంతో ఉన్న మహిళకు పురుటినొప్పులు రావడంతో అస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతో.. విధుల్లో ఉన్న నర్సు సెలవులో ఉన్న మరో సిస్టర్​ని అప్పటికప్పుడు పిలిపించి చికిత్స అందించారు. ఇలా ఉదయం నుంచి ఎంతో మంది రోగులు.. వైద్యులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత్యంతరం లేక ప్రైవేటు అస్పత్రులను అశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా 50 పడకల అసుపత్రిలో కనీస సిబ్బందిని ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : May 22, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details