తెలంగాణ

telangana

ETV Bharat / city

గాలి జనార్దన్​రెడ్డి గనుల కేసు.. విచారణలో పురోగతి లేదా?: సుప్రీంకోర్టు

Supreme Court on Gali Janardhan Reddy Case: గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసు నమోదై 12ఏళ్లయినా జడ్జి ఎదుట విచారణ సాగకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తీవ్ర అభియోగాలున్న కేసులో విచారణ సాగకపోవడం సరికాదని పేర్కొంది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. ట్రయల్‌ కోర్టులో కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలపాలని ఆదేశించింది. విచారణ ఆలస్యంపై ఈనెల 19వ తేదీ లోపు సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్‌ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

By

Published : Sep 14, 2022, 10:17 PM IST

Supreme Court on Gali Janardhan Reddy Case: గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసులో పన్నెండేళ్లైనా.. ట్రయల్‌ జరగకపోవడం ఏంటని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సరైన పద్ధతి కాదని, న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం తీవ్రస్థాయిలో స్పందించింది. తీవ్రమైన అభియోగాలు ఉన్న కేసులో 12 ఏళ్ల తర్వాతా విచారణ సాగకపోవడం చాలా దురదృష్టకరమన్న ధర్మాసనం.. ఇదే న్యాయస్థానం 2021 ఆగస్టు 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో విచారణ వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించినా.. విచారణలో ఎటువంటి పురోగతి లేకపోవడాన్ని తీవ్రంగా పరిగిణిస్తున్నట్లు పేర్కొంది.

గనుల ఆక్రమ తవ్వకాల కేసులో గాలితో పాటు మరో తొమ్మిది మందిపై సీబీఐ 2009లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2011, సెప్టెంబరు 5న జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసింది. కర్ణాటకలోని బళ్లారి, ఏపీలోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులతో 2015, జనవరి 20లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున తనపై ఉన్న బెయిల్ షరతులు సడలించాలంటూ ఆయన 2020లో సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా.. కేసు విచారణలో పురోగతి లేకపోవడంపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించింది.

బెయిల్ రద్దు చేయాలంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ.. బళ్లారి ఆయన స్వస్థలమని, అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని వివరించింది. ఇందుకు స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించారు. విచారణ సాగడం లేదని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బదులివ్వగా.. విచారణపై స్టే ఉందా అని జస్టిస్ ఎంఆర్​ షా ప్రశ్నించారు.

గతంలో ఐతే లేదని ఏఏజి సమాధానం ఇచ్చారు. గతంలో విషయం తాను అడగడం లేదని, ప్రస్తుతం ఉందా అని జస్టిస్ షా ప్రశ్నించారు. ఆ విషయంపై ఏఏజి వద్ద సరైన సమాధానం లేకపోవడంతో సీబీఐ అధికారులు నుంచి వివరాలు తెలుసుకోవాలని సూచించింది. విచారణ ఏ దశలో ఉంది, ఏ కారణాల చేత విచారణ ఆలస్యం అవుతుందో.. ఈ నెల 19వ తేదీలోపు సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని.. హైదరాబాద్‌ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జిని ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌కు పిటిషనర్ రిజాయిండర్ దాఖలు చేయొచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:Former MP Kothapalli Geeta Arrest : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు

గోవా కాంగ్రెస్​కు షాక్.. కాషాయ పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details