తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలవుతుందా..? కాదా..? - high court questioned government

రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలవుతుందా..? కాదా..?
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలవుతుందా..? కాదా..?

By

Published : Sep 4, 2020, 3:14 PM IST

Updated : Sep 4, 2020, 4:18 PM IST

15:11 September 04

విద్యాహక్కు చట్ట అమలుపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు...

రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న పలు పిల్స్‌పై న్యాయస్థానం విచారణ జరుపగా.... పూర్తి వివరాలతో సోమవారం కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.. పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారని... విద్యా హక్కు చట్టం అమలవుతుందా? కాదా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.  

నిధులు, ఖర్చుల వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి వెల్లడించలేదని వివరించింది.  బడ్జెట్ వివాదాలను ఈనెల 17 లోగా పరిష్కరించుకోవాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన హైకోర్టు... ఈ నెల 18న తుది విచారణ చేపడతామని ప్రకటించింది.

Last Updated : Sep 4, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details