High Court on Public Representatives Cases: ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో ఏపీ ప్రభుత్వం చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు కోర్టు అనుమతి లేకుండా ఎన్ని కేసులు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీసింది. ప్రజాప్రతినిధుల కేసుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్.. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎత్తివేశారని చెప్పారు. ఈ విధానం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని వాదించారు. అనంతరం కేసు విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.
కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదన్న న్యాయస్థానం
High court కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
hearing-in-high-court-on-against-public-representatives-cases-withdrawal-issue