విశాఖలో వైద్యుడు సుధాకర్‌పై జరిగిన దాడి కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈనెల 11న సీబీఐ రెండోసారి నివేదికను ధర్మాసనానికి సమర్పించింది. తుది నివేదిక ఇచ్చేందుకు మరో రెండు వారాలు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా... కోర్టు నిరాకరించింది. ఈనెల 26లోపు తుది నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.
వైద్యుడు సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ - doctor Sudhakar case issue in highcourt
వైద్యుడు సుధాకర్‌పై దాడి కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. తుది నివేదిక సమర్పణకు సీబీఐ రెండు వారాలు గడువు కోరగా... హైకోర్టు నిరాకరించింది. ఈనెల 26న నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

ap high court
ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు గతంలో సుమోటోగా తీసుకుంది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఇదీ చదవండి:'కేంద్రంపై దేశవ్యాప్త పోరు.. డిసెంబర్లో జాతీయ స్థాయి సమావేశం'