రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 1200 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.
మార్చి 1 నుంచి 65 ఏళ్లు పైబడినవారు, 45 దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి సహా పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.