తెలంగాణ

telangana

ETV Bharat / city

'అజాగ్రత్తగా ఉంటే వైరస్ మరో మారు విజృంభించే అవకాశం' - Health Officials Review meeting

కరోనా సహా సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల కేసులు తగ్గుతున్నప్పటికీ అజాగ్రత్తగా ఉంటే వైరస్ మరో మారు విజృంభించే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో కరోనా రెండో దశ ఉద్ధృతిపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు.

health officials review meeting on seasonal diseases and corona second wave
'అజాగ్రత్తగా ఉంటే వైరస్ మరో మారు విజృంభించే అవకాశం'

By

Published : Oct 27, 2020, 11:52 PM IST

గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు 40 నుంచి 50 శాతం తగ్గాయని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కరోనా సహా సీజనల్ వ్యాధుల నియంత్రణపై వివిధ జిల్లాల అధికారులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో.. అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో కరోనా రెండో దశ ఉద్ధృతిపై చర్చించారు.

రాష్ట్రంలో ఇటీవల కేసులు తగ్గుతున్నప్పటికీ అజాగ్రత్తగా ఉంటే వైరస్ మరో మారు విజృంభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లను గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే పరిక్షా కేంద్రాలను పెంచడంతో పాటు.. ప్రజలకు వ్యక్తిగత భద్రత పట్ల మరింత అవగాహన కల్పించాలని స్థానిక అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్త్రీ మహిళా సంక్షేమ కార్యదర్శి దివ్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, డీహెచ్ శ్రీనివాసరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని పగ తీర్చుకున్నాడు

ABOUT THE AUTHOR

...view details