వైద్య ఆరోగ్య శాఖలో ఇకపై పనితీరు ప్రామాణికంగా ప్రోత్సహకాలు ఉంటాయని మంత్రి హరీశ్ రావు(harish rao latest news) స్ఫష్టం చేశారు. బీఆర్కే భవన్లో కొవిడ్ టీకాల పంపిణీ(vaccination in telangana), కొత్త మెడికల్ కాలేజీలు(medical colleges in telangana) సహా పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు, డీసీహెచ్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్(harish rao meeting) నిర్వహించారు. సమావేశంలో డీఎంఈ రమేశ్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.
డిసెంబర్లోగా మెడికల్ కాలేజీలు పూర్తి..
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సమష్టి కృషి చేయాలని అధికారులను మంత్రి(harish rao on vaccination) ఆదేశించారు. అవసరమైతే ఇతర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 8 మెడికల్ కళాశాలల భవనాలను డిసెంబర్లో పూర్తి చేయాలని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేసిన హరీశ్ రావు... అవరమైన వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు.
ఆకస్మిక తనిఖీలుంటాయి..
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి ఆరోగ్యశ్రీ కింద 946 రకాల వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చినట్టు తెలిపారు. టీబీ, మలేరియా, లెప్రసీ నివారణ కార్యక్రమాలను సమీక్షించాలన్న హరీశ్ రావు... జిల్లాల్లో ఆర్బీఎస్కే యూనిట్లను యాక్టివేట్ చేయాలని తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు.
జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు, డీసీహెచ్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ వైద్యులకు ట్విట్టర్లో అభినందనలు..
అడవి దున్న దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పశువుల కాపారిని కాపాడిన భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను మంత్రి ట్విట్టర్ వేదికగా అభినందించారు. పాల్వంచ మండలానికి చెందిన సమ్మయ్య గత నెల 26న అడవిదున్న దాడికి గురయ్యాడు. కొత్తగూడెంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్ రవిబాబు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం సమ్మయ్యని కాపాడారు. అడవిదున్న దాడిలో ఛిద్రమైన బాధితుడి ముఖాన్ని రీకన్స్ట్రక్షన్ చేయటంతో విజయవంతమయ్యారు. శుక్రవారం సమ్మయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా... వైద్యుల బృందానికి హరీశ్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి ఇదే నిదర్శనమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: