త్వరలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు: మంత్రి ఈటల - local cancer centres
రాష్ట్రంలో రెండుమూడు చోట్ల ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
'రాష్ట్రంలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం'
క్యాన్సర్, హృదయ సంబంధిత రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి రాష్ట్రంలో పలుచోట్ల ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. వరంగల్లో ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు అందిస్తామని చెప్పారు. ఈ ఆస్పత్రుల్లో ఎమ్ఎన్జే ఆస్పత్రి తరహాలో వైద్యం అందిస్తామని వివరించారు.
- ఇదీ చూడండి : "ఇప్పుడు నా అక్కర మీకు లేదయ్యా.."