Health Ambassadors : సర్కారు బడుల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించడానికి హెల్త్ అంబాసిడర్లను నియమించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరిని నియమించాలని నిర్ణయించింది.
Health Ambassadors in Govt Schools : తొలివిడతలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో ఎంపికైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు(వారిలో ఒకరు మహిళ) హెల్త్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు.