కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా వసతి గృహాలను ఏప్రిల్ 6 వరకు మూసివేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈనెల 23 నుంచి వసతి గృహాలు, మెస్‌లు మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23న ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. హాస్టళ్లకు విద్యుత్, మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపింది. తరగతులు, పరీక్షల నిర్వహణపై ఏప్రిల్ 6 తర్వాత సమీక్షిస్తామని వెల్లడించింది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మూసివేత - కరోనా ప్రభావం
కరోనా ప్రభావం నానాటికీ ఎక్కువవుతోన్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 23 నుంచి వసతిగృహాలు, మెస్‌ల మూసివేతకు నిర్ణయించింది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. డిగ్రీ, బీఈడీ, ఎంబీఏ, బీఎల్ ఐఎస్సీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఫార్మా కౌన్సిల్లో ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్లు, ఇతర ఆన్లైన్ సేవలను రద్దు చేసినట్లు కౌన్సిల్ వెల్లడించింది.
ఇవీ చూడండి:ప్రపంచంపై కరోనా పంజా.. 10వేలకు చేరిన మరణాలు