తెలంగాణ

telangana

ETV Bharat / city

సెప్టెంబర్​ 24, 25, 26న హెచ్​సీయూ ప్రవేశ పరీక్షలు - హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్షలు

సెప్టెంబర్​ 24, 25, 26 తేదీల్లో హెచ్​సీయూ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య అప్పారావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో మూడు సెషన్లలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నవంబరు 1 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి.. తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు అప్పారావు తెలిపారు.

hcu entrance exams on September 24 to 26
hcu entrance exams on September 24 to 26

By

Published : Aug 19, 2020, 4:42 PM IST

హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు 24, 25, 26న నిర్వహించనున్నట్టు ఉపకులపతి ఆచార్య అప్పారావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో మూడు సెషన్లలో ఎంట్రన్స్ ఉంటుందన్నారు. గతేడాది మాదిరిగానే ఆఫ్​లైన్​లో పెన్ను, పేపర్ విధానంలో.. రెండు గంటల వ్యవధి ప్రవేశ పరీక్ష ఉంటుందని వీసీ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో.. అత్యధికంగా 65వేల దరఖాస్తులు వచ్చినట్టు వీసీ వెల్లడించారు.

నవంబరు 1 వరకు ప్రక్రియ పూర్తి చేసి.. తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు అప్పారావు తెలిపారు. రేపటి నుంచి ఆన్​లైన్ తరగతులతో పీజీ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. సుమారు 2 వేల 300 మంది పీజీ విద్యార్థులు ఆన్​లైన్ తరగతులకు హాజరవుతారన్నారు. డిసెంబర్ నెలాఖరుకి ఆన్​లైన్ సెమిస్టర్ పూర్తి చేస్తామని... విద్యార్థులు ఆన్​లైన్​లోనే సెమిస్టర్ నమోదు చేసుకోవాలన్నారు. ఫీజులు వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదని వీసీ అప్పారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details