హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్.. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లను కలిశారు. ఉప్పల్ స్టేడియం ఆస్తి పన్నును తగ్గించి... లీజ్ సమయాన్ని పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు.
'ఆస్తి పన్ను తగ్గించి... లీజ్ సమయాన్ని పెంచండి' - హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ వార్తలు
ఉప్పల్ స్టేడియం ఆస్తిపన్ను తగ్గించి... లీజ్ కాలాన్ని పెంచండి అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
'ఆస్తి పన్ను తగ్గించి... లీజ్ సమయాన్ని పెంచండి'
గ్రామీణ స్థాయిలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి... గ్రామీణ క్రీడాకారులను వెలికితీయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తోందని అజారుద్దీన్ వివరించారు. ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన మంత్రులు... ముఖ్యమంత్రితో చర్చిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా