హైదరాబాద్లో అనుమతుల్లేని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. నగరంలోని శాస్త్రీనగర్, టాటానగర్లోని కాలుష్య కారక పరిశ్రమలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీతో పాటు, విద్యుత్తు శాఖలకు హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే మూసివేసిన కంపెనీలు, వదిలివేసిన వ్యర్థాలను తొలగించి ఆ ప్రాంతాలను శుభ్రం చేయాలని సూచించింది.
అనుమతి లేని పరిశ్రమలపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం - Hc orders to Ghmc
హైదరాబాద్ శాస్త్రీనగర్‌లోని నివాస ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషిన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం జీహెచ్ఎంసీతో పాటు ఆయా శాఖలకు పలు ఆదేశాలు జారీ చేసింది.
Hc orders to Ghmc On Illeagal Industries
అక్రమంగా, అనుమతుల్లేకుండా నిర్వహిస్తోన్న పరిశ్రమలను ఉపేక్షించవద్దని తేల్చి చెప్పింది. శాస్త్రీపురంలోని నివాస ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషిన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశించింది.