విదేశాల నుంచి మొక్కజొన్న దిగుమతులకు అనుసరిస్తున్న విధానాలకు స్పష్టతనివ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. వాస్తవ వినియోగదారు పరిధి ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని తెలిపింది. మొక్కజొన్నను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుని చిన్నచిన్న పొట్లాలుగా చేసి విక్రయించడం వాస్తవ వినియోగదారు పరిధిలోకి వస్తుందా? రాదా? నిబంధనల ఉల్లంఘనో... కాదో చెప్పాలంది. ఒకవేళ దిగుమతిదారు అలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలంటూ విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
'వాస్తవ వినియోగదారు పరిధి ఎవరికి వర్తిస్తుంది?' - pop corn hc news
మొక్కజొన్న దిగుమతులకు అనుసరిస్తున్న విధానాలకు స్పష్టతనివ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. మొక్కజొన్న అంశంపై 250 మంది రైతులు, స్థానిక మొక్కజొన్న ప్రాసెస్సింగ్ యూనిట్‌దారులతో సహా.. పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలంటూ విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
!['వాస్తవ వినియోగదారు పరిధి ఎవరికి వర్తిస్తుంది?' 'వాస్తవ వినియోగదారు పరిధి ఎవరికి వర్తిస్తుంది?'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8162749-59-8162749-1595626274142.jpg)
'వాస్తవ వినియోగదారు పరిధి ఎవరికి వర్తిస్తుంది?'
మొక్కజొన్న అంశంపై 250 మంది రైతులు, స్థానిక మొక్కజొన్న ప్రాసెస్సింగ్ యూనిట్‌దారులతో సహా పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మొక్కజొన్నను, పాప్‌కార్న్‌ను దిగుమతి చేసుకుంటే స్థానిక రైతులు దెబ్బతింటున్నారని వాపోయారు. వాస్తవ వినియోగదారుల నిబంధనను ఉల్లంఘిస్తున్నా.... విదేశీ వర్తక డైరెక్టర్ జనరల్ పట్టించుకోవటంలేదంటూ వివరించారు