తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు..హైకోర్టులో విచారణ

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయటం, తొలగించటానికి అయిన ఖర్చుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. రంగుల వ్యవహారంలో రూ. 4 వేల కోట్లు ఎలా ఖర్చు అయ్యాయో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు..హైకోర్టులో విచారణ
ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు..హైకోర్టులో విచారణ

By

Published : Feb 16, 2021, 4:09 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయటం, తొలగించటానికి అయిన ఖర్చుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైకాపా జెండా రంగుల ఖర్చు వసూలుపై డాక్టర్ శైలజ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మెుత్తం ఖర్చును వైకాపా మంత్రులు, అధికారుల నుంచి వసూలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రసాద్ బాబు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. తీర్పు వచ్చే వరకు మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ విరమణ సౌకర్యాలు నిలిపివేయాలని కోరారు. అప్పటి వరకు బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలన్నారు.

వైకాపా రంగుల వ్యవహారంలో రూ. 4 వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ

ABOUT THE AUTHOR

...view details