తెలంగాణ

telangana

ETV Bharat / city

'మహిళలను స్తంభాలెక్కే పరీక్షకు అనుమతించండి'

జూనియర్​ లైన్​మెన్​ పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షలో అర్హత సాధించిన మహిళలకు స్తంభాలెక్కే పరీక్ష నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సదరు మహిళలను పరీక్షకు అనుమతించాలని ఎస్పీడీసీఎల్​ను ఆదేశించింది. లింగ వివక్ష తగదని హెచ్చరించింది.

By

Published : Dec 2, 2020, 9:21 PM IST

'మహిళలను స్తంభాలెక్కే పరీక్షకు అనుమతించండి'
'మహిళలను స్తంభాలెక్కే పరీక్షకు అనుమతించండి'

జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించిన మహిళలను స్తంభాలు ఎక్కే పరీక్షకు అనుమతించాలని ఎస్పీడీసీఎల్​కు హైకోర్టు సూచించింది. మహిళలు రాతపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ... స్తంభాలు ఎక్కే పరీక్ష నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం.. లింగ వివక్ష తగదని హెచ్చరించింది. మహిళలు రక్షణరంగం సహా అన్ని చోట్ల తమ సమర్థతను నిరూపించుకున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రెండు వారాల్లో స్తంభం ఎక్కే పరీక్షను నిర్వహించాలని ఎస్పీడీసీఎల్​ను ఆదేశించింది. రాతపరీక్ష ఉత్తీర్ణులైన మహిళలకు స్తంభాలు ఎక్కే పరీక్ష నిర్వహించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ ఇద్దరు మహిళా అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్పీడీసీఎల్ ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాతపరీక్ష ఉత్తీర్ణులయ్యాక మిగతా పరీక్షలు ఎందుకు నిర్వహించరని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ... దాఖలైన పిటిషన్​పై విచారణ రెండు వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది.

ఇదీ చూడండి: రేపటి నుంచి ఉదయం 6.30 - రాత్రి 9.30 వరకు మెట్రో రైల్‌

ABOUT THE AUTHOR

...view details