Harvard University invites KTR: యూఎస్‌కు చెందిన ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. 'ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్' సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను హార్వర్డ్ కోరింది. తెలంగాణ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, టర్బోఛార్జింగ్ ఇండియా అనే అంశాలపై మంత్రి కేటీఆర్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.
Harvard University invites KTR: హార్వర్డ్ సెమినార్‌కు కేటీఆర్.. అందిన యూనివర్సిటీ ఆహ్వానం - harvard university invites ktr to india conference at harvard
Harvard University invites KTR: ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20 న జరగబోయే 'ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్' సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనను కోరింది. ఈ మేరకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
కేటీఆర్‌కు హార్వార్డ్ ఆహ్వానం
ఈ సదస్సులో కేటీఆర్ ప్రాతినిథ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నిర్వాహకులు తెలపగా.. మంత్రి కేటీఆర్ సైతం అదే ఉత్సాహాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ సదస్సు ఈ నెల 20 న జరగనుంది. కాగా ఈ సదస్సులో కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు పంచుకోనున్నారు.
ఇదీ చదవండి:Woman Code to Win Contest : సవాళ్లతో సావాసం.. అదే ఆమె విజయ మంత్రం