తెలంగాణ

telangana

ETV Bharat / city

రాణిగంజ్ టు రసూల్​పురా... హరితహారం: తలసాని - minister talasani press meet on haritha haram

సికింద్రాబాద్​లోని రాణిగంజ్ నుండి రసూల్​పురా చౌరస్తా వరకు నూతనంగా ఏర్పాటుచేసిన వైట్ టాపింగ్ రోడ్డుకు ఇరువైపులా రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ తెలిపారు. వచ్చే నెల 4న నిర్వహించనున్న ఈ హరితహారం కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ హజరవనున్నట్లు ఆయన తెలిపారు.

రాణిగంజ్ టు రసూల్​పురా... హరితహారం: తలసాని

By

Published : Oct 31, 2019, 2:31 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాణిగంజ్ నుండి రసూల్​పురా చౌరస్తా వరకు నూతనంగా ఏర్పాటుచేసిన వైట్ టాపింగ్ రోడ్డుకు ఇరువైపులా రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 4న దాదాపు రెండువేల మొక్కలను నాటి పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్​లోని బుద్ధ భవన్​లో అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్​ను అందించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాణిగంజ్ టు రసూల్​పురా... హరితహారం: తలసాని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details