రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచి... హరిత తెలంగాణను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆరోవిడత మొక్కల పండుగ సందడిగా మొదలైంది. హైదరాబాద్‌లోని బల్కంపేట, దుండిగల్‌లో మంత్రి కేటీఆర్ మొక్కనాటారు. తెలంగాణను హరిత శోభితం చేయడమే లక్ష్యమన్న పురపాలక మంత్రి కేటీఆర్..భవిష్యత్ తరాలకు మెరుగైన పట్టణాలు అందించేందుకు.. హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.
హరిత శోభితం
రాష్ట్రం పచ్చగా ఉండాలంటే... సీఎం ఆశయం నెరవేరాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి.. అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంటలోని 20 హెక్టార్ల హరితవనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి... అడవుల విస్తీర్ణానికి తోడ్పాడాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.