తెలంగాణ

telangana

ETV Bharat / city

Harish Rao on Corona Vaccination : టీనేజర్లకు టీకా వేయించే బాధ్యత వాళ్లదే

Harish Rao on Corona Vaccination : తెలంగాణలో 15-18 ఏళ్ల వయసు గల వారికి కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. పిల్లలందరికి టీకా ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలదేనని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు కొవాగ్జిన్ టీకా అందిస్తున్నట్లు తెలిపారు.

Harish Rao on Corona Vaccination
Harish Rao on Corona Vaccination

By

Published : Jan 3, 2022, 10:55 AM IST

Updated : Jan 3, 2022, 11:37 AM IST

టీనేజర్లకు టీకా వేయించే బాధ్యత వాళ్లదే

Harish Rao on Corona Vaccination : రాష్ట్రంలో 15-18 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. పిల్లలకు టీకా ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్​ పీహెచ్​సీలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

7 రోజుల్లో 4 రెట్లు పెరిగింది..

Harish Rao On Omicron Cases : ఈనెల 10 నుంచి వృద్ధులకు బూస్టర్ డోస్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. పిల్లల టీకా బాధ్యతను కళాశాల యాజమాన్యాలు కూడా తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్​తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. వారం రోజుల్లో కరోనా పాజిటివిటీ 4 రెట్లు పెరిగిందని వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ, రాష్ట్ర సర్కార్​ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు.

వారి సమక్షంలోనే పిల్లలకు టీకా..

Harish Rao on Corona Vaccination for Teenagers : 'రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ టీకాలు అందిస్తున్నాం. అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలకు వ్యాక్సిన్ అందజేస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చాం.'

- హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ

పిల్లలకు టీకా బాధ్యత వారిదే..

Harish Rao on Corona Vaccination for 15-18 Age Group : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాలు, మందులు, సదుపాయాలు ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. కొవిడ్ టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణ కవచంలా పనిచేస్తోందని చెప్పారు.

Last Updated : Jan 3, 2022, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details