minister Harish rao:: రాష్ట్ర భాజపా నేతలపై మంత్రి హరీశ్‌రావు మరోసారి విరుచుకుపడ్డారు. భాజపా నేతలు రాష్ట్రానికి ఒక్కటైనా జాతీయ ప్రాజెక్టు తెచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో భాజపా నేతలు ఉపఎన్నిక ఎందుకు తెస్తారో చెప్పాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏం సాధించటం కోసం ఉప ఎన్నిక తెస్తారని ప్రశ్నించారు.
'భాజపా నేతలు ఉపఎన్నికలు ఎందుకు తెస్తారో చెప్పాలి. ఏం సాధించటం కోసం భాజపా నేతలు ఉపఎన్నిక తెస్తారు. గతంలో మేం తెలంగాణ కోసం రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వచ్చాయి. భాజపా నేతలు రాష్ట్రానికి ఒక్కటైనా జాతీయ ప్రాజెక్టు తెచ్చారా? తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి. ఉచితాలు ఇవ్వొద్దని భాజపా నేతలు చెప్తున్నారు. ఉచిత కరెంట్, పింఛన్లు ఇవ్వొద్దనేది భాజపా సిద్ధాంతం.మీటర్లు పెట్టి ఉచిత కరెంట్ తీసివేయాలని మోదీ చెప్తున్నారు.'-హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి