విశాఖపట్నం-హైదరాబాద్-దుబాయ్‌ల మధ్య నడుస్తున్న విమానాన్ని వారానికి మూడు రోజులపాటు ఏపీలోని విజయవాడకు మళ్లించడం కుదరదని విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
'ఆ విమానాన్ని విజయవాడకు మళ్లించటం కుదరదు' - విజయవాడ తాజా వార్తలు
విశాఖ- హైదరాబాద్-దుబాయ్‌ల మధ్య నడుస్తున్న విమానాన్ని ఏపీలోని విజయవాడకు మళ్లింటడం కుదరదని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

'ఆ విమానాన్ని విజయవాడకు మళ్లించడం కుదరదు'
విశాఖ-హైదరాబాద్-దుబాయ్ మధ్య ఎయిర్ ఇండియా విమానాలు క్రమం తప్పకుండా నడుస్తున్నాయని, వీటి ఫ్రీక్వెన్సీలో ఏమాత్రం మార్పుచేసినా వాటి లాభదాయకతపై ప్రభావం పడుతుందని స్పష్టంచేశారు. దేశంలో 969 ఎకరాల ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ భూమి ఆక్రమణలకు గురైనట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదీ చదవండి:నియామకాల్లో అణగారిన వర్గాలకు అన్యాయం