వేధింపులు తాళలేక మిస్సెస్ ఇండియా(2016) లక్ష్మీరావ్ సైబరాబాద్ సీపీని ఆశ్రయించారు. ఆత్మహత్యకు పాల్పడమని తిడుతున్నారని.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని వదంతులు సృష్టించారని సజ్జనార్‌కు లక్ష్మీరావ్ వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనకు రక్షణ కావాలని లక్ష్మీరావ్ కోరగా.. సీపీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారన్నారు. మరోసారి స్త్రీలపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ నల్లగండ్లలో లక్ష్మీరావ్, తన భర్త ఇద్దరు పిల్లలతో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అసోసియేషన్ సభ్యులు అతుల్ సింగ్, శ్రీజిత్, సిద్దార్థ అనే ముగ్గురు వేధింపులకు గురి చేస్తున్నారని గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ను ఆశ్రయించారు.