TIRUMALA BRAHMOTSAVALU : కలియుగ దైవం.. తిరుమల శ్రీనివాసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష తిరువాణాభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాఢవీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.
వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. హనుమంత వాహనంపై స్వామి వారి దర్శనం
TIRUMALA BRAHMOTSAVALU : కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుడు హనుమంత వాహనంపై తిరుమల మాఢవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
TIRUMALA BRAHMOTSAVALU
కోదండపాణియై ఆంజనేయునిపై ఆసీనులై విహరిస్తున్న స్వామివారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథంపై ఉభయదేవేరులతో మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇవీ చదవండి: