తెలంగాణ

telangana

ETV Bharat / city

సైకిల్ తొక్కుతూ స్వస్థలానికి బయల్దేరిన దివ్యాంగుడు

లాక్​డౌన్​ అమలు కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నడుస్తూ.. మరికొంతమంది సైకిళ్లపై స్వరాష్ట్రాలకు చేరుతున్నారు. ఇదే కోవలో 296 కిమీ దూరాన్ని ఒంటికాలుపై ఛేదిస్తున్నాడు ఓ యువకుడు. శరీర లోపం కంటే సంకల్ప బలమే గొప్పదని నిరూపిస్తున్నాడు.

సైకిల్ తొక్కుతూ స్వస్థలానికి బయల్దేరిన దివ్యాంగుడు
సైకిల్ తొక్కుతూ స్వస్థలానికి బయల్దేరిన దివ్యాంగుడు

By

Published : May 7, 2020, 12:05 AM IST

లాక్​డౌన్​తో చేసేందుకు పనుల్లేక.. చేతిలో డబ్బుల్లేక.. ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాల్లేక వలస కూలీలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. కూలీల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వారికోసం ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే వేల సంఖ్యలో వలస కూలీలు రకరకాల సాహసాలు చేసి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. మరికొందరు దారిలో ఉన్నారు. ఇదే రీతిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు గుజరాత్​లో చిక్కుకుపోయిన ఓ దివ్యాంగుడు. సైకిల్​పై 296 కిలోమీటర్ల యాత్రను చేపట్టాడు.

గుజరాత్ సూరత్​లో ఇటుకల బట్టీలో పనిచేసేవాడు మహారాష్ట్ర జల్​గావ్​ జిల్లా.. నాగల్​వాడీ వాసి సాగర్. లాక్​డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సూరత్​ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొద్దిసేపు నడుస్తూ.. కొంత సమయం సైకిల్ తొక్కుతూ ముందుకు సాగుతున్నాడు. గురువారం సాయంత్రానికి సాగర్​ స్వగ్రామానికి చేరుకుంటాడని తెలుస్తోంది.

సైకిల్ తొక్కుతూ స్వస్థలానికి బయల్దేరిన దివ్యాంగుడు

ఇదీ చూడండి:నవీముంబయి తీరంలో 'ఫ్లెమింగో' స్వేచ్ఛా విహారం

For All Latest Updates

TAGGED:

Nandurbar

ABOUT THE AUTHOR

...view details