తెలంగాణ

telangana

ETV Bharat / city

D.Ed colleges in Telangana : డీఈడీకి తగ్గిన డిమాండ్.. సగానికిపైగా మూతపడ్డ కళాశాలలు - half of the diploma colleges are closed in telangana

ప్రాథమిక విద్య(1-5 తరగతులు)లో బోధించేందుకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) కొలువులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) పాసైనవారూ పోటీపడవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎడ్‌(D.Ed colleges in Telangana) కోర్సులకు గిరాకీ తగ్గిపోయింది. రాష్ట్రంలో గత ఆరేళ్ల కాలంలో సగానికి పైగా కళాశాల(D.Ed colleges in Telangana)లు మూతపడ్డాయి. 2016-17లో 212 డీఎడ్ కళాశాలలుంటే.. ఈసారి 92 కళాశాలలే దరఖాస్తు చేశాయి.

D.Ed colleges in Telangana
D.Ed colleges in Telangana

By

Published : Oct 3, 2021, 9:08 AM IST

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఈడీ(D.Ed colleges in Telangana)) కోర్సులను అందించే కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతోంది. గత ఆరేళ్ల కాలంలో సగానికిపైగా కళాశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో 212 డీఎడ్‌ కళాశాలలు(D.Ed colleges in Telangana) (12,500 సీట్లు) ఉంటే గత ఏడాది 100కి (6,250 సీట్లు) తగ్గిపోయాయి. ఈసారి 92 కళాశాల(D.Ed colleges in Telangana)లే దరఖాస్తు చేశాయి. ఈ కోర్సుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. 2016-17లో 7,689 సీట్లు భర్తీ కాగా గత ఏడాది 2,830 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.

ప్రాథమిక విద్య(1-5 తరగతులు)లో బోధించేందుకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) కొలువులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) పాసైనవారూ పోటీపడవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎడ్‌(D.Ed colleges in Telangana) కోర్సులకు గిరాకీ తగ్గిపోయింది. గత 15 ఏళ్లుగా దీని వార్షిక ఫీజు పెరగలేదు. కేవలం రూ.12 వేలుగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. తర్వాత నాలుగేళ్లయినా మరొకటి రాలేదు. ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నందున కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు ఉండవని విద్యార్థులు భావిస్తున్నారు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) మౌలిక సదుపాయాలు, అర్హులైన అధ్యాపకుల నియామకంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ యాజమాన్యాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 90 శాతం డీఎడ్‌ కళాశాలలు(D.Ed colleges in Telangana) బీఈడీ కళాశాలల్లోనే కొనసాగుతుంటాయి. ‘ఫీజు పెంచాలని అడిగితే ఆ కోర్సుల్లో చేరేది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులని, అందువల్ల పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఆ రుసుములతో నాణ్యమైన విద్య అందించడం ఎలా వీలవుతుంది’ అని కళాశాల యజమాని ఒకరు ప్రశ్నించారు.

2019లో డీఈఈసెట్‌(D.Ed colleges in Telangana)కు 25 వేల మంది దరఖాస్తు చేయగా 2020లో ఆ సంఖ్య 14,036కు తగ్గిపోయింది. ఈ ఏడాది 7,591కు పడిపోయింది. అందులో పరీక్ష రాసింది 5,818 మంది. వారిలో ఉత్తీర్ణులైంది 3,911 మందే. డీఈఈసెట్‌(D.Ed colleges in Telangana) ఫలితాలు సెప్టెంబరు 15న వెల్లడికాగా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఆయా కళాశాలల(D.Ed colleges in Telangana)కు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. జాతీయ నూతన విద్యావిధానంలో ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో డీఈడీ(D.Ed colleges in Telangana) కోర్సు మనుగడ దాదాపు కోల్పోయినట్లేనని కళాశాల యజమాని ఒకరు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details