ఏపీలోని పాఠశాలల్లో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు జరగనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఏప్రిల్ నుంచే ఒంటిపూట బడులు: ఆదిమూలపు సురేశ్ - ఏపీ వార్తలు
ఏపీలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కేసుల పెరుగుదల, ఎండల కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
ఏప్రిల్ నుంచే ఒంటిపూట బడులు: ఆదిమూలపు సురేశ్
ప్రతిరోజు ఉ. 7.45 నుంచి 11.30 వరకు తరగతులు, మధ్యాహ్న భోజనం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనల అమలుపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అద్భుతంగా..: హరీశ్‌రావు