తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఉద్యమాలతో జ్యోత్స్న' పుస్తకాన్ని ఆవిష్కరించిన జ్వాలా గుత్త - అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా

హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మహిళా జర్నలిస్టు హసీనా రచించిన 'ఉద్యమాలతో జ్యోత్స్న' పుస్తకాన్ని జస్టిస్ రజినీతో కలిసి జ్వాల గుత్తా ఆవిష్కరించారు. అమ్మ అవయవ, శరీరదాతల సంఘానికి గౌవరధ్యాక్షురాలిగా ఉన్న జ్యోత్స్న... అవయవ దానాలను ప్రోత్సహించారని జ్వాల కొనియాడారు.

gutta jwala released book in pressclub
gutta jwala released book in pressclub

By

Published : Jan 23, 2021, 4:35 PM IST

సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురితో ప్రశంసలందుకున్న గుత్తా జ్యోత్స్న జీవిత వివరాలతో పుస్తకం రావడం సంతోషకరమని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తెలిపారు. హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మహిళా జర్నలిస్టు హసీనా రచించిన 'ఉద్యమాలతో జ్యోత్స్న' పుస్తకాన్ని జస్టిస్ రజినీతో కలిసి జ్వాల గుత్తా ఆవిష్కరించారు.

అమ్మ అవయవ, శరీరదాతల సంఘానికి గౌవరధ్యాక్షురాలిగా ఉంటూ అవయవ దానాలను ప్రోత్సహించారని జ్వాల కొనియాడారు. ప్రగతిశీల మహిళా సంఘం, కమ్యూనిస్టు పార్టీ జీవిత కాల శ్రేయోభిలాషి, సమష్టి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలతో సామాజాభివృద్ధికి తోడ్పడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అసహజ బంధానికి పెద్దలు నిరాకరణ.. యువతి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details