ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే తాను శాసనమండలి అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శాసనసభ కార్యదర్శికి నామపత్రాలు అందచేశారు. సీఎం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు మహ్మమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా నామినేషన్
శాసనసభ్యుల కోటా శాసనమండలి తెరాస అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు.
శాసనమండలి అభ్యర్థిగా గుత్తా నామినేషన్ దాఖలు
Last Updated : Aug 7, 2019, 6:29 PM IST