ప్రపంచమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నా కరోనాను కట్టడి చేయలేకపోతున్నాం. ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని ప్రముఖ వైద్యులు గురువారెడ్డి తెలిపారు. ప్రజల సాయం లేకుండా కొవిడ్ నివారణ అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణే ఏకైన మార్గమని ఉద్ఘాటించారు. సామాజిక దూరం పాటించడమే శ్రీరామరక్షని తెలిపారు.
'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం' - కరోనా రాకుండా ఏం చేయాలి
కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎంత కృషిచేస్తున్నా.. ప్రజల కృషిలేనిదే సాధ్యం కాదని ప్రముఖ వైద్యులు గురువారెడ్డి స్పష్టం చేశారు. కేవలం మన చేతుల్లోనే అంతా ఉందని... స్వీయ నియంత్రణే ఏకైన మార్గమన్నారు.
ఆరోగ్యానికి పన్నెండు సూత్రాలు..
అసలు కరోనా దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రభుత్వ పాత్ర ఎంత.. ప్రజలు ఏంచేయాలి.. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఫోన్, చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలని లాంటి సందేహాలకు విలువైన సూచనలు డా. గురువారెడ్డి మాటల్లోనే..
ఇవీచూడండి:కరోనా వైరస్ సోకితే రుచి, వాసన తెలియదు
Last Updated : Mar 25, 2020, 11:35 AM IST