దక్షిణ భారత రైల్వే సరికొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని హంగులతో ఆధునాతనంగా విస్తరిస్తూ.. ప్రయాణికులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అలాంటి కోవకు చెందినదే ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్.
ఈ దృశ్యాలు ఏదైనా అంతర్జాతీయ విమానాశ్రయం అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే ఇది గుంతకల్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన దృశ్యాలు. దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గుంతకల్ రైల్వే స్టేషన్‌ను..ఈ జోన్‌లోనే తలమానికంగా తీర్చిదిద్దారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఆధునీకరించారు.
ఆధునాతన హంగులు
రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే అద్దాలను తలపించే ప్లాట్ ఫామ్‌లు, వృద్ధులకోసం ఎస్కలేటర్,ప్రతి ప్లాట్ పామ్‌లో వైఫై సౌకర్యాలు, చరిత్ర వైభవం తెలిపే పెయింటింగ్స్, స్టేషన్ బయట ఫ్రీ ఎయిర్ థియేటర్, అత్యాధునిక లైటింగ్, పార్క్‌లతో తీర్చిదిద్దారు.