ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన స్వర్ణకారుడు దొంతంశెట్టి బాల నాగేశ్వరరావు తయారుచేసిన అతి సూక్ష్మ చెంచాకు గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు లభించింది. ఈ మేరకు గిన్నిస్ వెబ్‌సైట్‌లో శనివారం వివరాలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.
GUINNESS RECORD : అతి సూక్ష్మ చెంచాకు గిన్నిస్ గుర్తింపు..! - గిన్నీస్ రికార్డు జ్యూరీ తాజావార్తలు
ఏపీ తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన స్వర్ణకారుడు దొంతంశెట్టి బాల నాగేశ్వరరావు తయారు చేసిన అతి సూక్ష్మ చెంచా గిన్నిస్ వరల్డ్ రికార్డు(GUINNESS RECORD) గుర్తింపు పొందింది. చెక్కతో 3.09 మిల్లీమీటర్ల పొడవైన అతిచిన్న చెంచాను కేవలం రెండు గంటల 13 నిమిషాల వ్యవధిలో తయారు చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు.
గిన్నిస్ రికార్డు, అతిసూక్ష్మ చెంచా
ఈ ఏడాది జనవరి 10వ తేదీన నాగేశ్వరరావు స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు, అధికారుల సమక్షంలో.. చెక్కతో 3.09 మిల్లీమీటర్ల పొడవైన అతిచిన్న చెంచాను రెండు గంటల 13 నిమిషాల వ్యవధిలో తయారు చేశారు. సంబంధిత వీడియోలను గిన్నీస్ రికార్డు జ్యూరీకి పంపించారు. త్వరలో ధ్రువపత్రం పంపించనున్నట్లు సంస్థ సమాచారం ఇచ్చినట్లు నాగేశ్వరరావు తెలిపారు.