ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో నెహ్రూ చౌక్ వద్ద ఓ ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. ఆవు గర్భసంచి బయటకు వచ్చి.. తీవ్ర వేదనతో రహదారి పక్కనే రక్తస్రావంతో బాధ పడుతోంది. సమాచారం తెలుసుకున్న గుడివాడ పట్టణ సీఐ గోవింద రాజు.. తన సిబ్బందితో కలిసి ఆవు వద్దకు చేరుకున్నారు.
మూగజీవి ప్రాణాలు కాపాడిన సీఐ, డాక్టర్ - today Gudivada police rescued news update
ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గర్భసంచి బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావంతో బాధపడుతోన్న ఓ ఆవుకు వైద్యం చేయించి.. ఆ మూగజీవి ప్రాణాలను రక్షించారు.
ఆవుకు వైద్యం చేయించిన సీఐ
ఆవు పరిస్థితి చూసి చలించిపోయిన సీఐ.. వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి, కొన్ని గంటలపాటు శ్రమించి చికిత్స అందించారు. ఆవు ప్రాణాలను నిలిపారు. మరో పూట ఆలస్యమైతే ఆవు ప్రాణాలు పోయేవని వైద్యులు వెల్లడించారు. నోరులేని మూగ జీవి వేదనను గుర్తించి.. వైద్యం చేయించి ప్రాణాలు నిలిపిన సీఐ, డాక్టర్, సిబ్బందికి అక్కడి ప్రజలు అభినందనలు తెలిపారు.