హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ పర్యటించారు. రెండు రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన భారీ వృక్షాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేత తీయించారు.
గుడిమల్కాపూర్‌లో పర్యటించిన కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ - corporater clearing issues
హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ పర్యటించారు. వర్షాల వల్ల ఏర్పడిన పలు సమస్యలను తెలుసుకుని పరిష్కరించారు.

గుడిమల్కాపూర్‌లో పర్యటించిన కార్పొరేటర్ బంగారి ప్రకాశ్
విద్యుత్ అంతరాయం ఉన్న శారదానగర్, ఎల్ఐసీ కాలనీ, గాయత్రి నగర్లను సందర్శించిన ప్రకాశ్.... సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ విష్ణువర్దన్ రెడ్డి, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వనం హరి, డివిజన్ ప్రెసిడెంట్ రాములు, ఆనంద్ యాదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.