తెలుగు రాష్ట్రాల్లోని దళితవాడల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, మత మార్పిడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు సమకూర్చుకునే లక్ష్యంతో తితిదే 2019 మేలో శ్రీవాణి ట్రస్టును ప్రారంభించింది. తొలినాళ్లలో భక్తుల స్పందన అంతంతే కన్పించినా.. తర్వాత తితిదే ట్రస్ట్ బలోపేతానికి పలు సంస్కరణలు చేపట్టింది. ఇప్పటికే తితిదే అధ్వర్యంలో పలు ట్రస్టులు ఉన్నాయి. వీటికి రూ.లక్షకు పైబడి విరాళం ఇచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి గది వంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ఇవే నిబంధనలను శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేల విరాళం ఇచ్చి, రూ.500తో బ్రేక్ దర్శనం టిక్కెట్ తీసుకునే భక్తులకూ వర్తింపజేస్తోంది. వీరికోసం ఉదయం నిర్దేశిత సమయం కేటాయించింది. ఆలయంలో కులశేఖరపడి వరకూ అనుమతించడంతో పాటు శఠారి తీర్థ మర్యాదలను కల్పించింది. 2019 అక్టోబర్ 21 నుంచి మార్పులు చేపట్టి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. గత 18 నెలల కాలంలో కరోనా కారణంగా 3 నెలల పాటు ఆలయం తెరుచుకోలేదు. 2020 మార్చి నుంచి జూన్ వరకు ఆఫ్‌లైన్‌లో 93 రోజులు, ఆన్‌లైన్‌లో 84 రోజులు దర్శనాల బుకింగ్ నిలిపివేశారు. అయినప్పటికీ భక్తుల నుంచి రూ.11.43 కోట్ల విరాళాలు అందాయి. విరాళం అందజేసిన 90 రోజుల్లోగా దర్శనం చేసుకొనే వెసులుబాటును భక్తులు వినియోగించుకున్నారు.
1400 మంది దళారులకు చెక్