తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికం'

రాష్ట్రంలో 2019-20లో అధికంగా వర్షాలు కురిశాయని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. 33 జిల్లాలకుగాను 12జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయని... మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

ground-water-resources-division-certified-that-more-rain-fall-in-telangana
'తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికం'

By

Published : Feb 11, 2020, 6:49 PM IST

రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికంగా నమోదైందని భూగర్భ జల వనరుల విభాగం వెల్లడించింది. 2019-20లో వర్షపాతం వివరాలను ఆ శాఖ అధికారులు విడుదలచేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, మిగిలిన 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. 589 మండలాలకు గానూ 222 మండలాల్లో సాధారణం కన్నా 20శాతం అధిక వర్షపాతం, 309 మండలాల్లో సాధారణ వర్షపాతం, 58 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని వివరించారు.

వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట్ గ్రామంలో అతి తక్కువ 0.43 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభిస్తుండగా... నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్ష్​పల్లి గ్రామంలో అత్యధికంగా 52.03 మీటర్ల లోతుకు భూగర్బజలాలు పడిపోయాయన్నారు.

'తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికం'

ఇవీ చూడండి: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేయండి: ముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details