తెలంగాణ

telangana

ETV Bharat / city

సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యాసరాల పంపిణీ

సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చినా... ప్రస్తుత పరిస్థితుల్లో మరో నెల వరకు షూటింగ్​ జోరు కనిపించేలా లేదని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ అభిప్రాయపడ్డారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

By

Published : Jun 18, 2020, 7:49 PM IST

grocery distribution to film works through ccc at yellareddyguda hyderabad
సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యాసరాల పంపిణీ

ప్రభుత్వ అనుమతి, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో... ఒకటి రెండు చిత్రాలు షూటింగ్ మొదలుపెట్టినా అవి కార్మికుల ఉపాధికి ఏ మాత్రం సరిపోవని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ అన్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రెండో విడతలో భాగంగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్​​ ఎల్లారెడ్డిగూడలోని దర్శకుల సంఘం కార్యాలయం వద్ద 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులకు... నెల రోజులకు సరిపడే నిత్యావసర సరకులు అందజేశారు.

సీసీసీకి ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. మెదటి దశలో 13 వేల మంది కార్మికులను ఆదుకున్నామని, రెండో దశలోనూ వారందరికి చేయూత అందిస్తామని తెలిపారు. సీసీసీ సహకారం లభించడం తమ కుటుంబాల్లో ఎంతో ధైర్యాన్ని నింపిందని సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details