లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే కార్మికులు, కూలీలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైల్వే వ్యవస్థ పూర్తిగా రద్దైన తరుణంలో అందులో పని చేసే కార్మికులకు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. కూలీల ఇబ్బందుల్ని అర్ధం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు సంఘం నేతలు ఆదుకునేందుకు ముందుకొచ్చారు.
రైల్వే కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
నాంపల్లి రైల్వే స్టేషన్లో కూలీలకు, కార్మికులకు దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణి చేశారు. లాక్డౌన్ పూర్తి అయ్యేంత వరకు సేవా కార్యాక్రమాన్ని కొనసాగిస్తామని సంఘం నేతలు తెలిపారు.
నిత్యావసరాలు అందజేస్తున్న ఉద్యోగులు
నాంపల్లి రైల్వే స్టేషన్లో కూలీలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ పూర్తి అయ్యేంత వరకు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కొనసాగిస్తామని సంఘం నేతలు తెలిపారు.
ఇవీ చూడండి:జైల్లో మాస్కులు కుట్టే పనిలో 'ఉత్తమ నటుడు'