హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో వరద బాధితులకు బంజారా మహిళల ఎన్జీవో ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గుడిసెలు వేసుకొని జీవించే ప్రజలు వరదల వల్ల సర్వస్వం కోల్పోవడం బాధాకరమన్నారు.
వరద బాధితులకు బంజార మహిళల ఎన్జీవో చేయూత - బంజారా మహిళల ఎన్జీవో
భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలకు బంజారా మహిళల ఎన్జీవో తరపున నిత్యావసర సరకులు పంచారు. సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు.

కర్మన్‌ఘాట్‌లో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణి
బంజారా మహిళల ఎన్జీవో ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, పిల్లలకు బిస్కెట్లు పంటినట్టు తెలిపారు. పేదలకు సహాయం చేయడానికి సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్, మలక్‌పేట్ సీఐలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో కొనసాగుతోన్న వరుణుడి ప్రతాపం