ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయూతనందించారు. ఎంతో మంది భారతీయులు లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి, నిత్యావసర సరకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారి కోసం అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి, సభ్యులు సుమారు 200 మందికి నిత్యావసర సరకులు అందించారు.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులకు నిత్యావసరాలు - ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్
కరోనా వైరస్ ప్రచంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ కట్టడికి ఆస్ట్రేలియాలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ నివసించే భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందించారు.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులకు నిత్యావసరాలు
ఇమ్మిగ్రేషన్ సమస్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం త్వరలో ఉచిత కన్సల్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఫణి కుమార్, కిరణ్, వంశీ కొట్టల, కృష్ణ వడియలస రవి దామర, రఘు, పుల్లారెడ్డి, ప్రవీణ్ దేశం, అమర్, రాజవర్ధన్ రెడ్డి, మహేష్, సతీష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి